మరో క్షిపణి ప్రయోగం చేసిన ఉ.కొరియా
- August 13, 2017
అమెరికా, ఉ.కొరియాల మధ్య తలెత్తిన సంఘర్షణలు ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్దమయ్యేందుకు ఆజ్యం పోస్తోంది. ఉత్తర కొరియా జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలకు సిద్దమవుతున్నట్లు ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా బహిర్గతమైంది. ఇప్పటికే తనవద్ద ఉన్న జలాంతర్గాములను నవీకరించేందుకే ఉ.కొరియా ఈ ప్రయోగాలకు సిద్దమవుతుందని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలోనే గతేడాది ఆగష్టులో విజయవంతంగా ప్రయోగించిన పగ్గుక్సంగ్-1 క్షిపణిని నవీకరించేందుకే మళ్లీ ఈ జలాంతర్గామి క్షిపణిని తాజాగా మరోమారు ప్రయోగించిందని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలైలో ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్యాంగాంగ్ను ప్రయోగించటంతోనే అమెరికాతో పాటు దక్షిణ కొరియా, జపాన్లు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తమవద్ద లోడింగ్ చేయబడిన శక్తివంతమైన క్షిపణులు సిద్దంగా ఉన్నాయని వాటిని ప్రయోగించేందుకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు పంపారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







