లియోనార్డోడావిన్సీ జీవితగాధలో నటించనున్న లియోనార్డో డికాప్రియో

- August 13, 2017 , by Maagulf
లియోనార్డోడావిన్సీ జీవితగాధలో నటించనున్న లియోనార్డో డికాప్రియో

 ప్రముఖ చిత్రకారుడు లియోనార్డోడావిన్సీ జీవితాధారంగా రాబోతున్న చిత్రంలో రీల్‌ లైఫ్‌ డావిన్సీగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు లియోనార్డో డికాప్రియో నటింస్తున్నాడు. డికాప్రియో రీల్‌ లైఫ్‌ పాత్రల్లో నటించిన సినిమాల్లో ఇది తొమ్మిదో చిత్రం కావడం విశేషం. డికాప్రియో ఆఖరుగా నటించిన 'ది రెవెనెంట్‌'లోనూ ప్రముఖ అమెరికన్‌ ట్రేడర్‌ హ్యూగ్‌ గ్లాస్‌ పాత్రలో నటించాడు.
ఇప్పుడు నటించబోయే డావిన్సీ చిత్రానికి డిక్రాప్రియో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డికాప్రియో ఈ సినిమాకు ఒప్పుకోవడానికి ఓ ప్రత్యేకకారణం ఉంది. డికాప్రియో తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఇటలీలోని ఓ మ్యూజియంలో డావిన్సీ వేసిన ఓ చిత్రాన్ని వీక్షిస్తున్నారట. అప్పుడే ఆమెకి డికాప్రియో కడుపులో తన్నినట్లు అనిపించిందట. దాంతో బిడ్డ పుట్టగానే అతనికి లియోనార్డో డికాప్రియో అని పేరుపెట్టింది. ఇందుకోసమే తాను డావిన్సీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని డికాప్రియో వెల్లడించాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com