జేమ్స్ బాండ్ లాంటి స్టైలిష్‌ మూవీ హీరో అజిత్ 'వివేకం'

- August 14, 2017 , by Maagulf
జేమ్స్ బాండ్ లాంటి స్టైలిష్‌ మూవీ హీరో అజిత్  'వివేకం'

త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అక్ష‌ర హాస‌న్ హీరోయిన్స్‌.  ర‌క్త‌చ‌రిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరో అజిత్ అంటే ఇటు యూత్, మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. హీరో అజిత్ `వివేకం` చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నారు.  శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న`వివేగం` చిత్రాన్ని వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్‌ శొంఠినేని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `వివేకం` పేరుతో అందిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ర‌న్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుద‌లైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com