స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగిస్తుండగా ఒడిశా సీఎంకు అస్వస్థత
- August 15, 2017
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భువనేశ్వర్లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం సీఎం నివాసానికి తరలించారు. అక్కడ ఇద్దరు వైద్యులు ఆయనకి చికిత్స అందించారు.
ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. నవీన్ పట్నాయక్... ఈరోజు షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







