ఐటీ కంపెనీ టెకీలకు గుడ్‌న్యూస్
- August 17, 2017
ఐటీ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగాల్లో కోత పెడుతున్న నేపథ్యంలో భారీ టెక్నాలజీ కంపెనీలు భారీగా నియామకాలకు దిగుతుండటం టెకీలకు ఊరట ఇస్తోంది. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, ఒరాకిల్, ఐబీఎం, గోల్డ్‌మన్‌శాక్స్ వంటి ఎంఎన్‌సీలు వేలాది ఉద్యోగుల నియామకానికి సన్నాహాలు చేస్తుండటం ఐటీ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. యాక్సెంచర్ భారత్‌లో 5396 మందిని రిక్రూట్ చేసుకోనుండగా, ఫ్రెంచ్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని 2649 మంది ఉద్యోగులను చేర్చుకోనుంది. ఇక ఒరాకిల్ భారత్‌లో 1124 మందిని నియమించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఐబీఎం, గోల్డ్‌మాన్‌శాక్స్, డెల్, మైక్రోసాఫ్ట్, సిస్కో తదితర కంపెనీల్లోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగుల నియామక ప్రక్రియ ఊపందుకుంది. భారత్‌లో గ్లోబల్ ఇన్‌హౌస్ సెంటర్లు కలిగిన ఎంఎన్‌సీలు ఈ ఏడాది భారీగా నియామకాలను చేపడతారని కన్సల్టెన్సీ సంస్థ జిన్నోవ్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఈ సంస్థలు భారత్‌లో దాదాపు 30,000 మందిని పైగా నియమించుకుంటాయని భావిస్తున్నారు.ఐటీ దిగ్గజాలు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్ర తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న క్రమంలో తాజా నియామకాలు ఐటీ పరిశ్రమలో నూతనోత్తేజం నింపుతాయని పరిశ్రమ సంస్థ నాస్కామ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







