నారా రోహిత్ కథానాయకుడిగా 'తుంటరి'
- October 23, 2015
శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెం.2లో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి 'తుంటరి' అనే టైటిల్‌ను నిర్ణయించారు. దసరా రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. బాణం, సోలో, సారొచ్చారు, ప్రతినిధి, రౌడీఫెలో వంటి సినిమాలతో తనదైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయన నటిస్తున్న సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ కథను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ పక్కన లతా హెగ్దే నాయికగా నటిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ బాబా, నాగార్జున్ నిర్మాతలు. సినిమా టాకీపార్టు ఇటీవలే పూర్తయింది. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో కనిపిస్తారు. ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్.పళని కుమార్, మ్యూజిక్ః సాయికార్తీక్, ఎడిటర్ః తమ్మిరాజు, ఆర్ట్ః స్టంట్స్ః వెంకట్, కొరియోగ్రఫీః బాబా భాస్కర్, నిర్మాతలుః అశోక్ బాబా, నాగార్జున్, దర్శకత్వంః కుమార్ నాగేంద్ర
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









