మెట్రోరైలు కు అనుగుణంగా సిటీ బస్సులు
- August 18, 2017
నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం అవుతున్న మెట్రోకు అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఏర్పాట్లు చేస్తోంది. రైలు దిగిన వెంటనే ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు బస్సులు అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోస్టేషన్ల వద్దే బస్టాపులు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లోగా మియాపూర్, నాగోల్ కారిడార్లు పూర్తవుతాయని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సిటీ బస్సులను సమకూర్చుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మియాపూర్ నుంచి అమీర్‌పేట, నాగోల్ నుంచి అమీర్‌పేట రూట్లలో అదనపు బస్సులను నడపనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి వివిధ ప్రాంతాలకు 760, మియాపూర్ నుంచి 940 సిటీ బస్సులు నడుపుతున్న టీఎ్సఆర్టీసీ మెట్రో అందుబాటులోకి వచ్చేలోపు మరిన్ని బస్సులను సమకూర్చుకునే పనిలో పడింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









