జీతాల కోసం కన్స్ట్రక్షన్ కంపెనీ కార్మికుల ఆందోళన
- August 18, 2017
మనామా: ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 50 మందికి పైగా కార్మికులు అండలుస్ గార్డెన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ వేతనాల్ని చెల్లించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ, గత ఏడాది నవంబర్ నుంచి జీతాలు చెల్లించడంలేదని ఆరోపిస్తున్నారు ఆందోళన చేసిన కార్మికులు. వారిలో ఒక కార్మికుడు జగన్ మాట్లాడుతూ, బకాయిల్ని చెల్లించేసినట్లుగా మినిస్ట్రీకి కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. కొంతమందికి మాత్రమే వేతనాలు చెల్లించాలనీ, 30 మంది బహ్రెయినీ ఉద్యోగులకు మాత్రమే చెల్లింపులు జరిగాయనీ, వలసదారులమైన తామెవరికీ జీతాలు, బకాయిలూ కంపెనీ చెల్లించలేదని ఆయన ఆరోపించడం జరిగింది. కంపెనీకి పెద్ద కాంట్రాక్టులు రావడంతో 2016లో కార్మికుల్ని నియమించుకుంది. సప్లయర్స్ నుంచి పేమెంట్స్ లేకపోవడం, ప్రాజెక్టుల డిలే కావడంతో కంపెనీ నష్టాలపాలయ్యింది. కంపెనీ స్పందించకపోవడంతో తమ భవిష్యత్తు అంధకారమైపోయిందని జగన్ వాపోయారు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









