మలయాళీ స్టార్ హీరోలపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
- August 18, 2017
వివాదాలతో కాపురం చేసే రామ్ గోపాల్ వర్మ ఈ సారి ఏకంగా మలయాళ సూపర్ స్టార్ ల మీద పడ్డాడు. ఈయనకి తెల్లారితే ఎవరో ఒకరిని ఏడిపించడం, ఎవరో ఒకరితో గిల్లి కజ్జాలు పెట్టుకోకపోతే నిద్ర పట్టదు.
మళ్ళీ మళ్ళీ కెలికి మరీ తిట్టించుకోవడం భలే సరదా ఆయనకి. తాజాగా కేరళ లో సన్నీ లియాన్ కి వచ్చిన విశేష స్పందన ఫోటోలో మీరు కూడా ఇంటర్నెట్ లో చూసే ఉంటారు.
ఈ ఫోటోలని పట్టుకున్న వర్మ వాటితో పాటు పోస్టింగ్ చేసి మరీ మమ్ముట్టి, మోహన్ లాల్ ల మీద తీవ్ర కామెంట్ లు చేసాడు. " ఈ ఫోటో చూసి , సన్నీ విశేష స్పందన చూసి మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ ఆఫ్ కేరళ వాళ్ళు కుళ్లిపోయి ఉంటారు.
ఈ ఫోటో చూసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు .. " అంటూ ఫేస్బుక్ లో కామెంట్ పెట్టాడు. ఓ కార్యక్రమానికి సంబంధించి సన్నీలియోన్ ఇటీవల కేరళకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అక్కడి జనాలు ఎగబడ్డారు. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన అభిమానులతో రోడ్డు కిక్కిరిసిపోయింది.ఆ ఫోటో ఇంటర్నెట్ లో చాలా పెద్ద ఫేమస్ అయ్యింది కూడా.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









