రైళ్ల పై పడిన అల్పపీడన ప్రభావం

- August 19, 2017 , by Maagulf

ఒడిశా తీరం వైపు ఏర్పడిన అల్పపీడనం శనివారానికి ఉత్తర కోస్తాంధ్ర, దాని చుట్టు పక్కల ప్రాంతాలవైపు వచ్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా మరో 3, 4రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మీదుగా ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందన్నారు.

ఏపీ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు 
బిహార్‌, పశ్చిమబంగ సరిహద్దుల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ మీదుగా దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు ఉత్తర సరిహద్దు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కిషన్‌గంజ్‌, పంజిపరా రైల్వేస్టేషన్ల మధ్య రైల్వేట్రాక్‌లపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

రద్దయిన రైళ్ల వివరాలు తేదీల వారీగా... 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com