తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకలు
- August 20, 2017
తెలంగాణా ప్రజల కీ తెలంగాణా ప్రాంతానికీ ఈ బతుకమ్మ పండగ చాలా ప్రత్యేకమైనది .. ఈ పండుగ సందర్భంగా మహిళల కి ఉచితంగా చీరలు పంపిణీ చెయ్యడం కోసం ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
చేనేత కి కూడా అండగా ఉండాలి అనే ప్రభుత్వ సంకల్పం తో దాదాపు తొంభై లక్షల చీరలని ఉచితంగా పంపిణీ చెయ్యబోతున్నారు అది కూడా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి. దీన్లో భాగంగా సిరిసిల్ల చేనేత కార్మికులకి అరవై లక్షల చీరలు ఆర్డర్ ఇచ్చారు.
సూరత్ టెక్స్టైల్ మిల్స్‌కు మరో 30 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చింది.అయితే ఈ నిర్ణయం మీద అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. చేనేత అంటే ఒక్క సిరిసిల్లే కాదని, పోచంపల్లి, కొయ్యలగూడెం, గద్వాల, నారాయణపేట, పుట్టపాక కూడా ఉన్నాయన్న సంగతిని విస్మరించడం దారుణమని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
రాజకీయంగా వచ్చే ఎన్నికల టైం కి తమ కోసం సిరిసిల్ల ప్రాంత స్థానం సుస్థిరం చేసుకోవడం కోసమే కేటీఆర్ ఇలాంటి ప్లాన్ ప్లే చేస్తున్నారు అని కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. అసలు సిరిసిల్ల కార్మికులు చేనేత కిందకు రారని, వారు పవర్ లూములు ఉపయోగిస్తున్నారని కాంగ్రెస్ వాదిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







