దేశవ్యాప్తంగా నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

- August 21, 2017 , by Maagulf
దేశవ్యాప్తంగా నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

 కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక బ్యాంకింగ్‌ సంస్కరణలకు నిరసనగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్ల పిలుపు మేరకు మంగళవారం దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.అజయ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం, కార్పొరేట్‌ రుణమాఫీ చేయడమే కాకుండా ఇటీవల ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు- 2017ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే డిపాజిట్‌దారులకు రక్షణగా ఉన్న డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ గ్యారెంటీ రద్దవుతుందని తెలిపారు. కార్పొరేట్‌ సంస్థల మొండిబకాయిలతో బ్యాంకుల మనుగడకు ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వం డిఫాల్టర్ల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనం చేపట్టవద్దని, జీఎస్టీపేరిట సేవల రుసుం పెంపు ఉపసంహరించాలని కోరారు. బ్యాంకు పాలకమండళ్లలో డైరెక్టర్ల ఖాళీల భర్తీ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కారుణ్య నియామకాలు చేపట్టడం తదితర 17 డిమాండ్ల పరిష్కారానికి సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com