ఆండ్రాయిడ్, ఐఫోన్లలోకి వాట్సాప్ కొత్త స్టేటస్ మారనున్నది
- August 22, 2017
వాట్సాప్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న స్టేటస్ ఫీచర్ కొత్త రూపురేఖలను సంతరించుకుంది. బీటా టెస్టింగ్ అనంతరం వాట్సాప్ ఎట్టకేలకు తన ఆండ్రాయిడ్, ఐఫోన్ యాప్స్‌కు టెక్ట్స్ స్టేటస్‌ను రంగులమయంగా మార్చేసింది. కలర్ఫుట్ టెక్ట్స్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ తొలుత ఫేస్బుక్ గతేడాది తన ఆండ్రాయిడ్ యాప్‌కు లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో స్టేటస్ అప్డేట్కు కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఫాంట్, ఎమోజీల్లో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికీ కలర్‌ఫుల్ టెక్ట్స్ ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నట్టు వాట్సాప్ ధృవీకరించింది. అయితే అందరి యూజర్లకు ఇంకా ఇది అందుబాటులోకి రాలేదని రిపోర్టులు చెబుతున్నాయి. అలాగే స్టేటస్‌లో వెబ్ లింక్‌లను పెట్టుకునే అవకాశం కూడా కల్పించింది. ఫేస్బుక్లో కలర్‌ఫుల్ టెక్ట్స్ అప్డేట్లకు అనూహ్య స్పందన ఉంది. అచ్చం అలానే వాట్సాప్ కూడా తన యూజర్లకు ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే సోషల్‌మీడియాలో వాట్సాప్ దూసుకెళ్తోంది. ఇది తీసుకొస్తున్న కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లు కూడా విపరీతంగా పెరుగుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







