వీసా గడువు ముగిసినా లండన్‌లో 200మంది భారతీయుల అరెస్టు
- August 22, 2017
వీసా గడువు ముగిసినా లండన్‌లో ఉన్న భారతీయుల్ని అరెస్టు చేసినట్లు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. భారత్ నుంచి ఏటా సుమారు వెయ్యి మంది ఎలాంటి వీసా లేకుండా లండన్‌లో ప్రవేశిస్తున్నారంటూ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య వీసా గడుపు పూర్తి అయినా తిరిగి స్వదేశానికి వెళ్లకుండా అక్కడే కొనసాగుతన్న సుమారు 200మంది భారతీయుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌తో పాటు పాకిస్థాన్, అప్గనిస్థాన్, చైనా, ఆల్బానియా చెందిన పలువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. వీరిందరి వద్ద ఉన్న పాస్‌పోర్టులను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు వారికి జరిమానా విధించారు. వెస్ట్ లండన్‌లోని సౌత్ఆల్ ఏరియాలో సుమారు ఏడుగురు భారతీయులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. గడువు ముగిసినా ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించుకుని..
ట్యాక్స్ కట్టడంలేదని వారు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతను ఆకర్షిస్తోన్న ఏజెన్సీలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







