మాడా వెంకటేశ్వరరావు మృతి

- October 24, 2015 , by Maagulf
మాడా వెంకటేశ్వరరావు మృతి

మాడా క్యారెక్టర్ తో సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు మాడా వెంకటేశ్వరరావు నిన్న రాత్రి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి 11 గంటలకు జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. 1950 అక్టోబర్ 10న వెంకటేశ్వరరావు జన్మించారు. ముత్యాలముగ్గు, చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలతో మాడకు మంచి గుర్తింపు లభించింది. చూడు పిన్నమ్మ అనే పాత్రతో మాడాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com