సాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయ వలసదారుడు
- August 23, 2017భారతీయ వలసదారుడొకరు, సౌదీలో స్పాన్సరర్ కారణంగా ఇబ్బందులు పడుతున్నాననీ, అక్రమంగా దేశంలో నివసించాల్సిన పరిస్థితి వచ్చిందనీ, ఈ పరిస్థితుల్లో తనకు సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఏడేళ్ళ క్రితం సౌదీ అరేబియాకి వచ్చిన ఉదైర్ కురుప్పయ్యా అనే వ్యక్తి, సౌదీకి చెందిన స్పాన్సరర్ దగ్గర 900 సౌదీ రియాల్స్ జీతంతో పనికి కుదిరారు. అయితే కొన్నాళ్ళ క్రితం కురుప్పయ్యా, సౌదీ స్పాన్సరర్ ద్వారా మూడు నెలల విజిట్ వీసాపై బహ్రెయిన్‌కి వచ్చి, అక్కడే ఇరుక్కుపోయారు. మంచి జీవితం ఉంటుందని భావించి సౌదీ అరేబియాకి వెళితే తన పరిస్థితి ఇలా అయిపోయిందంటూ వాపోతున్నారు కురుప్పయ్య. తన వీసాను స్పాన్సరర్ రెన్యువల్ చేయించకపోవడంతో తన మీద 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా పడిందనీ, ఈ పరిస్థితుల్లో సహకరించలేమని ఎంబసీ అధికారులు తెలిపారని కురుప్పయ్య అంటున్నారు. దాతలు సహకరిస్తే తన కష్టాలు తీరుతాయని వాపోతున్నారాయన.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ