అణుక్షిపణులు ప్రయోగం కారణంగా ఉ.కొరియాపై అమెరికా కీలక నిర్ణయం

- August 23, 2017 , by Maagulf
అణుక్షిపణులు ప్రయోగం కారణంగా ఉ.కొరియాపై అమెరికా కీలక నిర్ణయం

తరచూ అణ్వస్త్ర ప్రయోగాలతో తలనొప్పిగా మారిన ఉత్తరకొరియా ఆటకట్టించే దిశగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అణుక్షిపణులు, ఆయుధాల తయారీలో ఉత్తర కొరియాకు సహకరిస్తున్న చైనా, రష్యాలకు చెందిన 10 కంపెనీలు, ఆరుగురు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆయా కంపెనీలు, వ్యక్తులు వ్యవహరిస్తున్నందున వారి కార్యకలాపాలు స్తంభింపచేసినట్లు అమెరికా ఖజానా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తికి కృషి చేస్తున్న ఉత్తరకొరియాకు సహకరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అమెరికా హెచ్చరించింది. అణ్వస్త్ర నిరోధానికి ఉత్తరకొరియాపై ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టంచేసిన ఖజానా శాఖ.. ఆ దేశానికి సహకరించే వారిని అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి దూరం పెడతామని తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి సూచించిన మౌలిక సూత్రలనే ప్రభుత్వం అనుసరిస్తున్నట్లు అమెరికా ఖజానా మంత్రి స్టీవెన్‌ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com