ఇకపై సౌదీలో భారతీయులకు ఉద్యోగాలు కష్టం
- August 23, 2017
స్వదేశీయులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటీవల అగ్రరాజ్యం అమెరికా తమ వీసా విధానంలో నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సౌదీ అరేబియా కూడా తమ దేశస్థులకు ఉద్యోగవకశాలు పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆ దేశంలో పాటించే నితాఖత్(సౌదీసేషన్) విధానంలో సవరణలు చేపట్టింది. విదేశీయుల కంటే సౌదీలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేలా ఈ సవరణలు చేసింది. సెప్టెంబర్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఉపాధి కోసం సౌదీ వెళ్లే భారతీయులకు ఉద్యోగాలు దొరకడం కష్టతరం కానుంది.
ఇటీవల లోక్‌సభలో ఇచ్చిన నివేదిక ప్రకారం.. 2016లో భారత్ నుంచి 25లక్షల మంది సౌదీలో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ రంగంలో ఉన్నవారే. అంటే కూలీలు, మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ్‌బంగా, బిహార్, కేరళ రాష్ట్రాల నుంచి సౌదీకి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విదేశాల నుంచి వలసలు పెరిగిపోతుండటంతో స్వదేశీయులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు సౌదీ అరేబియా 2011లో నితాఖత్ విధానాన్ని తీసుకొచ్చింది. అంటే ప్రయివేటు సెక్టార్లలో విదేశీ ఉద్యోగులకు బదులుగా సౌదీ జాతీయులకు ఉద్యోగావకాశాలు పెంపొందించడం. ఈ విధానం కింద దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలను నాలుగు కేటగిరీలుగా చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు, చేసే వ్యాపారం, వచ్చే ఆదాయాన్ని, ఉద్యోగుల సగటు జీతం బట్టి ప్లాటినం, గ్రీన్, ఎల్లో, రెడ్ సంస్థలుగా విభజించింది.
వీటిని బట్టి సంస్థల్లో సౌదీ, విదేశీ ఉద్యోగుల నిష్పత్తిని ప్రభుత్వం తయారుచేస్తుంది. ఉదాహరణకు ప్లాటినం సంస్థల్లో 40శాతం కంటే ఎక్కువగా సౌదీ జాతీయులే ఉద్యోగులుగా ఉండాలి. ఇప్పటివరకూ 10 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రయివేటు సంస్థలకు నితాఖత్ విధానాన్ని అమలు చేసేవారు. తాజాగా చేపట్టిన సవరణలో ఈ సంఖ్యను 6 లేదా అంతకంటే ఎక్కువకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక.. ప్లాటినం, హైగ్రీన్ సంస్థలు మాత్రమే బ్లాక్ వీసాల జారీకి అర్హులని నిర్ధారించింది. ప్లాటినమ్, హైగ్రీన్ కేటగిరీల్లో ఉండే సంస్థలు తక్కువగా ఉండటంతో భారత్ నుంచి వెళ్లే వారికి ఉద్యోగావకాశాలుతగ్గిపోనున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







