ప్రముఖ కన్నడ టీవీ యాక్టర్స్ రచన,జీవన్ రోడ్ ప్రమాదం లో మృతి
- August 24, 2017
పుణ్యక్షేత్రానికి వెళ్లి బెంగళూరు తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ టీవీ సీరియల్ ప్రముఖ నటీ, నటుడు దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని మాగడి తాలుకా సోలూరు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనాయి.
మహానది, త్రివేణి సంగమ, మధుబాల తదితర సూపర్ హిట్ సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషించిన నటి రచనా (23), నటుడు జీవన్ (25) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్ అనే యువకులకు తీవ్రగాయాలై హర్షా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
కార్తిక్ పుట్టిన రోజు సందర్బంగా బుధవారం అందరూ బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుక్కేసుబ్రమణ్య దేవస్థానంకు వెళ్లారు. అక్కడే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్తిక్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
గురువారం వేకువ జామున సఫారీ కారులో అందరూ బెంగళూరు బయలుదేరారు. మార్గం మధ్యలో మాగడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి 48లో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను సఫారీ కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో నటి రచనా, నటుడు జీవన్ దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారిని స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితులను 108 వాహనాల్లో హర్షా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను ఢీకొన్నారా ? లేక ఆకస్మికంగా ప్రమాదం జరిగిందా ? అని దర్యాప్తు చేస్తున్నామని కుదూరు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







