తెలుగు సినీ ఇండస్ట్రీ లో దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్ అయిన పి.పుల్లయ్య పై స్పెషల్ స్టోరీ
- August 24, 2017
మన సినిమా తొలినాళ్లలో అడుగుల నుంచి నడకలకు వచ్చేనాటికి.. చాలామంది నిర్మాతలే తమ సినిమాలను డైరెక్షన్ కూడా చేసుకునేవారు. నిర్మాత, దర్శకులుగా ఓ వెలుగు వెలిగిన వారు అనేకమంది ఉన్నారు. టాకీపులి హెచ్ఎమ్. రెడ్డి, బిఎన్.రెడ్డిదీ ఈ బాటలో నడిచిన వారే. అయితే పి పుల్లయ్య ఇందుకు భిన్నం. ఆయన ముందు దర్శకుడుగా సక్సెస్ అయి ఆ తర్వాతే నిర్మాతగా మారాడు. దర్శకత్వం వహించిన సినిమాలతో స్వీయదర్శకత్వంలో పి పుల్లయ్య రూపొందించిన చిత్రాల విశేషాలను ఇవాల్టి ఫేవరెట్ ఫైవ్ లో చూద్దాం..
టాలీవుడ్ లో పుల్లయ్య అనేది మోస్ట్ కన్ఫూజన్ పేరు. కారణంఏంటంటే.. మనకు ఇద్దరు పుల్లయ్యలు ఉండేవారు. ఒకరు మీసాల పుల్లయ్య అలియాస్ చిత్తజల్లు పుల్లయ్య. పోలుదాసు పుల్లయ్య. ఈ పోలుదాసు పుల్లయ్యే డిగ్రీ చదువుకుని గ్రామ్ ఫోన్ కంపెనీలో ఉద్యోగం ప్రారంభించి తర్వాత నెమ్మదిగా గాయకుడై...ఆ తర్వాత సినిమాల్లో రచయితగా ప్రవేశించి దర్శకుడయ్యారు. ఆ డైరక్టరుగారే... తర్వాత చరిత్ర సృష్టించిన చిత్రాలెన్నో తీశారు.
సారంగధర తర్వాత దర్శకుడుగా బిజీ అయిన పుల్లయ్య తన సినిమాలో హీరోయిన్ గా చేసిన శాంతకుమారినే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కల్సి సొంతంగా చిత్ర నిర్మాణం చేపట్టాలనుకున్నారు. తొలి చిత్రంగా సాంఘికం తీయాలనుకున్నారు. మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేవార్ నవలను తీసుకుని తెలుగులో సినిమాగా తీశారు. అది మాటల రచయితగా చక్రపాణికీ, నటుడుగా అక్కినేనికీ కూడా తొలి చిత్రం కావడం విశేషం. పుల్లయ్యగారి సొంత చిత్రాల్లో చాలా వరకు అక్కినేనే హీరోగా చేయడం మరో విశేషం.
అర్ధాంగి, పెన్నియన్ పెరుమైల తర్వాత పుల్లయ్య , శాంతకుమారి దంపతులు తమ కూతురు పద్మ పేరుతో పద్మశ్రీ బ్యానర్ ప్రారంభించారు. అప్పటి వరకు వారు నిర్మించిన చిత్రాలన్నీ రాగిణి పిక్చర్స్ బ్యానర్ లో వచ్చాయి. పద్మశ్రీ వారి తొలిచిత్రంగా వెంకటేశ్వర మహత్మ్యం తీసారు. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది. అంతే కాదు తమకు మరో పది సినిమాలు తీసేంత ఆర్ధిక లాభాల్ని కలిగించిన చిత్రం శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం అనేవారు పుల్లయ్యగారు.
శ్రీ వేంకటేశ్వర మహత్యం తర్వాత పుల్లయ్యగారు పూర్తిగా స్వంత చిత్రాలకే పరిమితం అయిపోయారు. బయట చిత్రాలకు దర్శకత్వం వహించడం పూర్తిగా మానేశారు. అలాగే వేంకటేశ్వర మహత్యం సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. మరో సెన్సేషనల్ రీమేక్ కు ఆ సినిమా రంగం సిద్దం చేసింది. ప్రేరణ కలిగించింది. ఆ సెన్సేషనల్ మూవీ ఏంటో చూద్దాం.
పద్మశ్రీ బ్యానర్ మీద ఆసైముఖం, తాయే ఉనక్కాగ లాంటి తమిళ సినిమాలు కూడా తీశారు పుల్లయ్య. పుల్లయ్యగారికి బూతుల పుల్లయ్య అనే నిక్ నేమ్ ఉండేది. సెట్ లో ఎవరైనా తప్పు చేస్తే బూతుల సునామీ సృష్టించేవారాయన. విజయా గార్టెన్స్ లో మాటలు నేర్చిన చిలుకలు ఉండేవి...ఎప్పుడైనా అవి బూతులు మాట్లాడితే...ఈ రోజు పుల్లయ్యేమైనా వచ్చాడా ఇటు అని అడిగేవారు నాగిరెడ్డి. చనిపోవడానికి ఓ పన్నెండేళ్ల ముందే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకున్నారు పుల్లయ్య.
1975లో తన చివరి చిత్రం తీశారు పుల్లయ్య. కె.పి.కొట్టార్కర రాసిన కథను...అందరూ బాగుండాలి పేరుతో తెరకెక్కించారు. గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ రాసిన ఈ చిత్రం పద్మశ్రీ వారి చివరి సినిమాగా మారింది. శాంతకుమారి, సత్యనారాయణ, జగన్నాథ్ వంటివారు నటించిన ఈ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో పుల్లయ్య చిత్ర నిర్మాణ రంగం నుంచి పక్కకు వచ్చారు. అలా ధర్మపత్నితో మొదలైన పుల్లయ్య స్వీయ నిర్మాణ చిత్రాలకు పుల్ స్టాప్ పడింది.
Tag:P Pullaiah, film, director, and, producer
పి.పుల్లయ్య పై స్పెషల్ స్టోరీ
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







