ఆధార్‌ వ్యవస్థ సురక్షితమే

- August 27, 2017 , by Maagulf
ఆధార్‌ వ్యవస్థ సురక్షితమే

న్యూదిల్లీ: ఆధార్‌ వ్యవస్థ సురక్షితంగా ఉందని.. ఎటువంటి లీకులకు అవకాశం లేదని ది యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా భరోసానిచ్చింది. ఇటీవల కొన్ని విదేశీ సంస్థల చేతిలోకి ఆధార్‌ సమాచారం వెళ్లిందని వస్తున్న వార్తలను యూఐడీఏఐ కొట్టిపారేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్‌ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసిందని పేర్కొంది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఇటువంటి తప్పుడు ప్రచారాలను చేపడుతున్నారని తెలిపారు. ఆధార్‌ కోసం వినియోగించే ప్రతి యంత్రాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే బయోమెట్రిక్‌ సమాచారం సేకరించడానికి వినియోగిస్తామని అన్నారు.
ఆధార్‌ డేటాబేస్‌లోకి అమెరికా నిఘాసంస్థ సీఐఏ చొరబడిందని వికీలీక్స్‌ పేర్కొనడంతో కలకలం రేగింది. దీంతో యూఐడీఏఐ స్పందించి వివరణ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com