తారక్, రాజమౌళి... ఓ సైబర్ క్రైమ్ సినిమా
- August 28, 2017
టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో బ్లాక్ బస్టర్లను అందించిన విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత జక్కన్న కొత్త చిత్రం ఏది? అన్న ప్రశ్న మొదలైనప్పుడు ఎన్టీఆర్ తో కూడా అన్న పేరు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఓ సదుద్దేశం కోసం వీరిద్దరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లో రాను రాను పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు, వాటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నగర క్రైమ్ బ్రాంచ్ సిద్ధమైంది. ఇందుకోసం రూపొందించబోయే షార్ట్ ఫిల్మ్‌లలో ఈ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలిద్దరూ భాగస్వాములు కాబోతున్నారు. లఘు చిత్రాలకు ఎన్టీఆర్, రాజమౌళిలు స్వచ్ఛందంగా వాయిస్ ఓవర్ అందించేందుకు ముందుకు వచ్చారు.
ఇప్పటికే తారక్ తన పని పూర్తి చేయగా, తన గొంతుకను అందించటంతోపాటు ఆయా చిత్రాల్లో చిన్న చిన్న మార్పులను సూచించేందుకు రాజమౌళి రెడీ అయిపోయాడు. వీటిని బస్టాండ్‌లలో, రైల్వే స్టేషన్‌లలో, షాపింగ్ మాల్, టీవీలలో త్వరలో ప్రదర్శితం చేయనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







