'జై లవకుశ'లో మరో హీరోయిన్
- August 28, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'. బాబీ దర్శకుడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉందట. అందులో కథానాయిక తమన్నా ఆడిపాడనున్నట్లు సమాచారం. మిల్కీబ్యూటీ అయితే పాటకు మరింత అందం తీసుకొస్తారని దర్శక-నిర్మాతలు భావించారట. ఈ మేరకు ఆమెను సంప్రదించగా నటించడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక గీతం ఇప్పటి వరకు వచ్చిన వాటితో పోల్చితే చాలా విభిన్నంగా ఉంటుందని, తమన్నా కొత్త అవతారంలో కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్, తమన్నా జంటగా 'వూసరవెల్లి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తమన్నా ఇప్పటికే 'జాగ్వార్', 'అల్లుడు శీను' తదితర చిత్రాల్లోని ప్రత్యేక గీతాల్లో ఆడిపాడారు. ప్రస్తుతం ఆమె కల్యాణ్‌రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు.
'జై లవకుశ'లో నివేదా థామస్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభించింది. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







