ఆసియా కార్మికులను లక్ష్యంగా చేసుకున్న వీసా ముఠా షార్జాలో పట్టివేత

- October 26, 2015 , by Maagulf
ఆసియా కార్మికులను లక్ష్యంగా చేసుకున్న వీసా ముఠా షార్జాలో పట్టివేత

యూ. ఏ. ఈ. లో ప్రవేశం మరియు నివాసo కోసం నకిలీ  వీసాలను సృష్టించి, బయటి దేశాల ప్రజలకు అమ్ముతున్న పాకిస్తానీ ముఠాను షార్జా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు మొదట పట్టుకున్న ఒక వ్యక్తిని విచారించిన అనంతరం, యూ. ఏ. ఈ.  లో ఉద్యోగాలను ఆశిస్తున్నఈ ముఠా ఆసియా దేశాల శ్రామికులను లక్ష్యంగా చేసుకుని, వారివద్ద డబ్బు వసులుచేసి నకిలీ వీసాలను అం టకడుతున్నట్టు తెలియవచ్చింది. అనంతరం మిగిలిన సభ్యులను కూడా పోలీసు వారు అదుపులోకి తీసుకున్నారు.  దేశ తూర్పు ప్రాంత  పోలీసు స్టేషన్ల డైరక్టర్ - కల్నల్ మొహమ్మద్ అల్ ఒబాద్ ఇటువంటి ముఠాల ఉచ్చులో పడవద్దని, ప్రజలను ఈ సందర్భంగా హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com