40 మంది తెలుగు వారికి అబుదాబిలో ఫైన్
- August 29, 2017
అబుదాబిలో ఇరుకు గదుల్లో ఎక్కువ మంది నివసిస్తే, ఆయా ప్రాంతాలపై అక్కడి ప్రభుత్వం దాడులు చేస్తోంది. ఎమిరేట్స్ నివాస నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. తెలుగువారు నివసిస్తున్న గృహాలపై దాడులు చేసిన అధికారులు ఒకే రోజు 40 మందికి జరిమానాలు విధించడం వారిలో గుబులు రేపుతోంది. ఉపాధి నిమిత్తం వెళ్తున్న తెలుగువారు వేతనాలు తక్కువగా ఉండటంతో 10 నుంచి 20 మంది ఒకే గదిలో ఉంటున్నారు. చాలా కాలంగా అక్కడ ఈ వ్యవహారం సాగుతుండగా, అబుదాబి ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝలిపిస్తోంది. ఎమిరేట్స్ రెసిడెన్షియల్ నియమా వళి-2011 చట్టం సంఖ్య-1లో పేర్కొన్నట్లుగా అబుదాబి మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నవారు ఇకపై ఒక గదిలో ముగ్గురికన్నా మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అపార్ట్మెంట్ లేదా విల్లాలో ఒక కుటుంబం మాత్రమే ఉండాలని, బ్రహ్మచారులైతే ఒక బెడ్ రూమ్లో ముగ్గురు వ్యక్తులే ఉండాలని, వంట గది, కారిడార్, సాధారణ ప్రాంతాల్లో నిద్ర పోవడానికి ఉపయోగించవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







