డ్రగ్స్ మత్తు లో 'నిట్'
- August 30, 2017తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్నటివరకు హైదరాబాద్ చుట్టూ తిరిగిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు వరంగల్ నిట్‌కి పాకింది. తాజాగా వరంగల్‌లోని నిట్‌లో బుధవారం డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు స్టూడెంట్స్‌ని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నిట్ హాస్టల్‌లో అధికారులు సోదాలు చేపట్టారు.
పట్టుబడిన విద్యార్థుల నుంచి ఎల్ఎస్‌డీని స్వాధీనం చేసుకున్నారు. డార్క్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసినట్టు
తెలుస్తోంది. నిందితులు నిట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఒకరు బిజ్జు, మరొకరు రమేష్. వీళ్లిద్దరు
కొద్దిరోజులుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంబంధిత అధికారుల ఆదేశాల
మేరకు వీళ్లని అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







