రికార్డు స్థాయిలో పడిన పసిడి ధర
- August 30, 2017
పరుగులు పెట్టిన పుత్తడి ఒక్కరోజులోనే మళ్లీ భారీగా కిందకి పడిపోయింది. ఉత్తరకొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించిందనే వార్తల నేపథ్యంలో మంగళవారం అమాంతం పైకి ఎగిసిన బంగారం ధరలు, బుధవారం 350 రూపాయల మేర ఢమాలమన్నాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, దానికి తోడు స్థానిక జువెల్లర్ల నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 350 రూపాయలు పడిపోయి, రూ.30,100గా నమోదైంది.
వెండి కూడా 500 రూపాయల మేర క్షీణించి, 41వేల రూపాయల మార్క్ కిందకి చేరింది.. ఇండస్ట్రియల్ యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి పెద్దగా డిమాండ్ రాకపోవడంతో కేజీ వెండి ధర బులియన్ మార్కెట్‌లో రూ.40,600గా నమోదైంది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు 0.07 శాతం పడిపోయి ఔన్స్‌కు 1,308.60 డాలర్లుగా నమోదయ్యాయి. సిల్వర్ కూడా 0.43 శాతం క్షీణించి ఔన్స్‌కు 17.35 డాలర్లుగా ఉన్నాయి.
దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.350 చొప్పున పడిపోయి రూ.30,100గా, రూ.29,950గా నమోదయ్యాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఇది రూ.550 మేర పెరిగిన సంగతి తెలిసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







