బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నబాహుబలి
- August 30, 2017
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతోపాటు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో థర్డ్ పార్ట్ కూడా వున్నట్లు వార్తలొచ్చినప్పటికీ లేదని తేల్చేసింది యూనిట్. మూవీ లేకపోయినా బాహుబలి రూపంలో కొద్దిరోజుల్లోనే టీవీ సిరీస్ రాబోతోందని ఒకానొక సందర్భంలో చెప్పాడు రైటర్ విజయేంద్రప్రసాద్. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బాహుబలి మేకర్స్‌తో ఓ మల్టీ నేషనల్ కంపెనీ చర్చలు జరుపుతోంది.
ఐతే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టకుండా, పర్యవేక్షణకే పరిమితంకానున్నాడు రాజమౌళి. కాకపోతే జక్కన్న పేరుని మాత్రం ఆ కంపెనీ వినియోగించుకోనుంది. సీజన్ వారీగా బాహుబలి సిరీస్‌ని తీసుకురావాలన్నది ఎంఎన్‌సీ థాట్. ఈ నేపథ్యంలో బాహుబలి పేరుని వినియోగించుకున్నందుకు రాయల్టీ రూపంలో మేకర్స్‌కి 25 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మిగతాచర్చలు ఓ కొలిక్కి వస్తే త్వరలో భారతీయ బుల్లితెర ప్రేక్షకులను బాహుబలి అలరించడం ఖాయం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







