ఒక రాజరిక భోజన అనుభవం' ఖంసమా 'ను పరిచయం చేస్తున్న ఇండియా ప్యాలెస్
- August 30, 2017
దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : ఆగష్టు 30, 2017: సాంప్రదాయిక అంతర్గత అంశాలతో పూర్తిస్థాయి భారతీయ ఆహారాన్ని శుచిగా శుభ్రంగా అందించడంలో పురస్కారం పొందిన రెస్టారెంట్ ఇండియన్ ప్యాలెస్ రాజవంశ భోజన అనుభవాన్నిపరిచయం చేస్తుంది, ఖంసామా,అనే ఆహార పదార్థం భారతదేశం యొక్క గొప్ప వారసత్వం యొక్క ఓ మధుర జ్ఞాపకం. పరిపూర్ణతతో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా వండుతారు, పరిమిత ఎడిషన్ ఫెస్టివల్ మెనూలో గొప్ప రుచికరమైన మసాలా వంటకాలు ఉన్నాయి, ఇవి చరిత్రలో మహారాజులు ఆరగించిన పసందైన ఆహారాన్ని తప్పక గుర్తుకు తెస్తాయి. కొత్త ఖంసామా మెను సాంప్రదాయిక రాయల్ ఇండియన్ ఆహార వారసత్వం, భారతీయ ఘుమ ఘుమ లాడే ఆహారం నోరు ఊరిస్తుంది. రుచికరమైన కూరలు మరియు బిర్యాని రాచరిక వంటశాల నుండి తయారుచేయబడుతుంది. ఖాంమామా వండటంలో అనుభవం కల్గిన రాజరిక వంటలను వండటంలో సిద్ధహస్తులైన గొప్ప వంటగాళ్లు సాంప్రదాయక పద్దతిలో వాటిని తయారుచేస్తారు. ఇది గంభీరమైన ఆధునిక వంటశాలలలో రూపొందించబడుతుంది. ఈ కొత్త మెనూలో అరుదైన మరియు రుచిగల వంటకాలు ఖచ్చితంగా మహారాజుల నోటి జిహ్వలను సంతృప్తిపరిచగలదు . ఎస్ ఎఫ్ సి గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ కే. మురళీధరన్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధితో మాట్లాడుతూ "మా పరిమిత-ఎడిషన్ ఖంసమా ఉత్సవాన్ని ప్రారంభించటానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఒక పురాతన సాంప్రదాయం, సన్హేరి జీగెంగ మరియు కస్తరి ముర్గ్ ను నేను గట్టిగా సిఫార్సు చేయవలసిన కొన్ని వంటకాలు ఉన్నాయి.గొప్ప సువాసన కలిగిన సుల్తాన్-ఇ-గోష్త్ & షాహి జఫ్ఫ్రాని ముర్గ్ ప్రధానమైన వంటకాలను తయారుచేస్తారు. ఈ ఆహారం తినే సమయంలో అచ్చం మహారాజులు తినే మాదిరిగానే అనుభూతి పొందవచ్చు. ఈ తరహా భోజనం చేయాలనుకునే వారందరికీ ఈ అనుభవాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









