ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఎన్ఆర్ఐ సుహసిని మృతి

- August 30, 2017 , by Maagulf
ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఎన్ఆర్ఐ సుహసిని మృతి

హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో ఇండియాకు చెందిన కేశపల్లి సుహసిని మరణించింది. అయితే ఈ ప్రమాదం నుండి ఆమె ఏడేళ్ళ కొడుకు సరక్షితంగా బయటపడ్డాడు.సుహసిని మృతదేహన్ని హైద్రాబాద్‌కు రప్పించేందుకు తెలుగు సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
హోండా సివిక్ కారులో న్యూ టంపా రోడ్డు మీదుగా సుహసిని ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. సుహసిని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
ఆమె ఏడేళ్ళ కొడుకు సుచీర్ బొజ్జ స్వల్పగాయాలతో ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. స్థానికులు అతడిని టంపా ఆసుపత్రికి తరలించారు.ఒక్కరోజు చికిత్స తర్వాత సుచీర్ బొజ్జను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. లేక్‌ల్యాండ్ నుండి ఇటీవలే సుహసిని కుటుంబం టంపాకు వచ్చినట్టు సుహసిని భర్త సురేష్ చెప్పారు.
సుహసిని స్నేహితులు విరాళాల వసూలు కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ కార్యక్రమంలో సుహసిని చురుకుగా పాల్గొన్నారని స్నేహితులు గుర్తుచేస్తున్నారు.
సుహసిని సహకారంతోనే ఈ విరాళాల సేకరణ ఊపందుకొన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
నార్త్ అమెరికన్ తెలుగు సోసైటీ, ఆమె స్నేహితులు సుహసిని భౌతికకాయాన్ని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదం గత శుక్రవారం నాడు చోటుచేసుకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com