హార్వే తుపాను: వర్షంలో ఈత కొట్టేందుకు వెళ్లిన నిఖిల్ మృతి

- August 30, 2017 , by Maagulf
హార్వే తుపాను: వర్షంలో ఈత కొట్టేందుకు వెళ్లిన నిఖిల్ మృతి

హార్వే తుపాను ధాటికి నిఖిల్‌ భాటియా అనే భారతీయ విద్యార్థి మృతి చెందాడు. టెక్సాస్‌లో పీహెచ్‌డీ చదువుతున్న నిఖిల్‌..  వర్షంలో ఈతకొట్టేందుకు వెళ్లి సరస్సులో మునిగి చనిపోయాడు. కాగా.. వరదల్లో చిక్కుకున్న అమెరికా ప్రజలకు అక్కడి అధికారులతో పాటు భారతసంతతి ప్రజలు కూడా ఆపన్న హస్తం అందిస్తున్నారు. అనేక భారతీయ రెస్టారెంట్లు, కుటుంబాలు వారికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. పలువురు భారత సంతతి వైద్యులు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. 
వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వేలాది సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  హ్యూస్టన్, సమీప ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు వరదలో చిక్కుకున్న 13 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. వరదలను అవకాశంగా తీసుకుని జరిగే దొంగతనాలు, నేరాలను నివారించేందుకు హ్యూస్టన్‌లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com