త్వరలో రానున్న ప్రభాస్ మురుగుదోస్ కాంబినేషన్

- August 31, 2017 , by Maagulf
త్వరలో రానున్న ప్రభాస్ మురుగుదోస్ కాంబినేషన్

బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఆకాశాన్ని అంటుతోంది. ఈ సినిమా కోసం ఐదేళ్లపాటు పెళ్లిని సైతం వాయిదా వేసుకున్న ప్రభాస్ కమిట్మెంట్‌కు తగ్గ గుర్తింపు లభించింది. ఇదిలావుండగా సూపర్ కాప్ రోల్‌లో ప్రభాస్ చేస్తున్నాడని వినిపిస్తున్న సాహో భారీ రేంజ్ లో నిర్మాణం జరుగుతోంది. తమిళం, హిందీలోనూ రిలీజ్ చేసేలా తెరకెక్కుతోంది.
మరోవైపు ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. స్పైడర్ డైరెక్టర్ మురుగదాస్‌తో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని లేటెస్ట్ న్యూస్. అయితే ఈ మూవీ 2019లోనే సెట్స్‌కు వెళ్తోందని ఈలోగా మురుగదాస్-విజయ్‌తో ఓ చిత్రం చేస్తుండగా, ప్రభాస్-దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేయనున్నాడట. ఈ రెండు ఫినిష్ అయ్యాకే ప్రభాస్- మురుగదాస్ సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమంటున్నారు. ఈలోగా ప్రభాస్‌ కోసం తగిన స్టోరీని రెడీ చేసే పనిలోపడ్డాడట. ఏదేమైనా ఇక ప్రభాస్ సినిమాలన్నీ మల్టీలాంగ్వేజ్ కాన్సెప్ట్‌తో భారీగా తెరకెక్కుతాయని తెలుస్తోంది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com