సౌదీ మసీదు దుర్ఘటనలో 12 మందికి గాయాలు ఒకరి మృతి

- October 27, 2015 , by Maagulf
సౌదీ మసీదు దుర్ఘటనలో 12 మందికి గాయాలు ఒకరి మృతి

 దక్షణ సౌదీ అరబియా ప్రాంతం, నజాన్ లోని షియా మసీదులో ఒక భక్తుని మృతికి, పలువురు గాయాల పాలవడానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడికి తామే బాధ్యులుగా ఉగ్రవాద ముఠా ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.) ప్రకటించుకుంది. ఈ సంస్థ,  సౌదీ అరబియా లో ఉండే మినారిటీ తెగ ఐన  ఇస్మైలీ షియైతీ ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ  గ్రూపు, అరబ్ ద్వీపకల్పంలోని పరిపాలకులపై తిరుగుబాటు లేవదీసి, సౌదీ లోని సున్నీ యువతను షియైతీ ల వంటి లక్ష్యాలపై దాడిచేయవలసిందిగా ప్రోత్సహిస్తోంది. ఈ ఘటనా స్థలంలో దొరికిన ఒక తీవ్రవాది తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో, ఈ దాడి చేయడానికి నిర్ణయించుకున్నట్టు నిరూపణ అయిందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా అల్ మాష్హాడ్ మసీదులో సాయంకాల ప్రార్ధనలు ముగించుకొని ప్రజలు బయలుదేరుతుండగా దాడి జరిగిందని అక్కడి స్థానిక ప్రజలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com