విచిత్రం కూతురికి అంబులెన్స్ కానుక ఇచ్చిన తండ్రి
- September 02, 2017
కూతురికి ఏ తండ్రైనా బంగారం, బాగా డబ్బుంటే ఓ బంగ్లా కూడా బహుమతిగా ఇస్తాడు. తన కూతురు అత్తారింట్లో ఏ లోటు లేకుండా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. అంతవరకే ఆలోచిస్తాడు. పశ్చిమ బెంగాల్ హుగ్లీకి చెందిన అలోక్ బసు అనే వ్యక్తి ఇటీవల తన కుమార్తె అల్ఫా బసుకి వివాహం జరిపించాడు. అయితే వరుడి తరపు వారు ఎలాంటి కట్న కానుకలు కోరలేదు. దీంతో అలోక్ సమాజానికి ఉపయోగపడే వస్తువుని తన కూతురికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. అనుకోవడమే కాకుండా ఆచరణలో చూపించారు. అంబులెన్స్ బహుమతిగా ఇచ్చి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయమని కూతురిని కోరారు. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాకుండా తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేశారు. సమాజ శ్రేయస్సు కోరే ఈ తండ్రికి వందనం.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







