గుంటూరులో జిమ్ ఓపెనింగ్ కి వెళ్లి లిఫ్ట్ లో ఇర్రుకున్న హీరో నిఖిల్

- September 02, 2017 , by Maagulf
గుంటూరులో జిమ్ ఓపెనింగ్ కి వెళ్లి లిఫ్ట్ లో ఇర్రుకున్న హీరో నిఖిల్

బిజినెస్‌ డెవలప్‌మెంట్ కోసం, పబ్లిసిటీ కోసం సెలబ్రేటీలను పిలవడం సహజం. ఇలానే గుంటూరులో  ఉన్న జిమ్ యజమాని తన సంస్ధను ప్రారంభించడానికి యంగ్ హీరో నిఖిల్ ను పిలిచాడు. దీనికి నిఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిమ్ యజమాని చాలా హ్యాపీగా ఫీలైయ్యాడు. జిమ్ ప్రారంభమ్యే అంతస్థుకు వెళ్లాడానికి నిఖిల్ లిఫ్ట్ ఎక్కాడు. నిఖిల్ గుంటూరు వస్తున్నాడని తెలియడంతో అతని అభిమానులు ఆయన కంటే ముందుగానే జిమ్ దగ్గరకు చేరుకున్నారు. అందరూ నిఖిల్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో అతడు ఎక్కిన లిఫ్ట్ సడెన్ గా ఆగిపోయింది. గమ్యం చేరడానికి కాస్త దూరంలో లిఫ్ట్ అగిపోయింది. అంతే అక్కడ ఉన్న వారంతా హైరానా పడ్డారు. లిఫ్టు డోరు తెరవడానికి అక్కడి సిబ్బంది బాగా ట్రై చేశారు. కానీ కుదరలేదు. ఫ్యాన్స్ అందరు ఆందోళన చెందుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను పిలిపించారు. పోలీసుల ఎంట్రీ తర్వాత లిఫ్ట్ డోర్స్ పగలగొట్టి హీరో నిఖిల్ ను బయటికి సేఫ్ గా తీసుకోని వచ్చారు. దీంతో జిమ్ యజమాని, అక్కడికి చేరుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సంఘటనతో నిఖిల్ కాస్త అసహనానికి  గురయ్యాడు....చేదు అనుభవం రూచి చూడాల్సి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com