వలసదారుడి పార్తీవదేహానికి బహ్రెయిన్‌లో అంత్యక్రియలు
- September 02, 2017
మనామా: భారతీయ వలసదారుడొకరు గుండెపోటుతో మరణించగా, అతని పార్తీవ దేహానికి బహ్రెయిన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. కేరళ నుంచి బహ్రెయిన్‌కి వచ్చిన సంతోష్‌కుమార్ అనే వలసదారుడు ఆగస్ట్ 27న గుండెపోటుతో అకామడేషన్‌లో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ కుమారుడు సుమేష్ సంతోష్‌కుమార్ బహ్రెయిన్‌లో వ్యాపారవేత్త కాగా, మరో కుమారుడు సుమిత్ సంతోష్‌కుమార్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు. స్వదేశానికి మృతదేహాన్ని తరలించేందుకు వీలు లేకపోవడంతో హిందూ సంప్రదాయాల ప్రకారం బహ్రెయిన్‌లోనే అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ వలంటీర్స్, ఎంకె సిరాజుద్దీన్, సుబైర్కుమార్ మాట్లాడుతూ, మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో అది కుదరలేదని చెప్పారు. సంతోష్‌కుమార్, బహ్రెయిన్‌కి 28 ఏళ్ళ క్రితం వచ&ఆచరు. అలహ్సా ఆటో సర్వీస్ అనే సంస్థన జిద్ అలి ప్రాంతంలో (ఇసాటౌన్ సమీపంలో) ఏర్పాటు చేశారు. 'పెరువాజియాంబలమ్, స్వామి అయ్యప్పన్' తదితర సినిమాల్లోనూ ఆయన నటించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







