స్టోనింగ్‌ రిట్యుల్‌: కట్టుదిట్టమైన భద్రత

- September 02, 2017 , by Maagulf
స్టోనింగ్‌ రిట్యుల్‌: కట్టుదిట్టమైన భద్రత

మినా: సైతాన్‌ అనే రాయిని కొట్టేందుకు రాళ్ళను వినియోగించే ప్రక్రియలో భాగంగా గతంలో చోటు చేసుకున్న తొక్కిసలాటను దృష్టిలోపెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జమారాత్‌ బ్రిడ్జ్‌ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. 2016లో ఇక్కడే పెను తొక్కిసలాట చోటుచేసుకుంది. 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. హజ్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద దుర్ఘటన. ఈ నేపథ్యంలోనే 100,000 మంది భద్రతా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. యాత్రీకులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా, తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో యాత్రీకులు ఒకేసారి గుమికూడటం, అదే సమయంలో రాళ్ళను సైతాన్‌ వైపు విసరడం ఈ క్రమంలో గలాటా చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com