విద్యుత్‌ కేంద్రంపై దాడి

- September 02, 2017 , by Maagulf
విద్యుత్‌ కేంద్రంపై దాడి

బాగ్దాద్‌: ఇరాక్‌లోని ఓ విద్యుచ్చక్తి కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో 8మంది ప్రాణాలు కోల్పోగా 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సమర్రా నగర సమీపంలోని అల్‌-జల్‌సియా విద్యుత్‌ కేంద్రం ఆవరణలోకి గుర్తు తెలియని ఏడుగురు వ్యక్తులు ఆయుధాలు, పేలుడు సామగ్రితో ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. వారి కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు ఆగంతకులు హతమయ్యారు. ఘటన అనంతరం భద్రతా దళాలు విద్యుత్ కేంద్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే, ఈ ఘటనకు తామే బాధ్యులమని ఏ ప్రకటన వెలువడలేదు. ఐఎస్‌ తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com