స్పెషల్ స్టోరీ: కెనడా లో 'కూచిపూడి డాన్స్' వర్క్ షాప్
- September 03, 2017కెనడా: నృత్యాలయం, శ్రీమతి వేమూరి సుధా మరియు తెలుగువాహిని నడుపుతున్న కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూట్ తెలుగువాహిని - టొరొంటో సాహిత్య సాంస్కృతిక సంస్థతో సంయుక్తంగా నృత్యవాహిని పేరిట 3 వారాలపాటు తక్కువ వ్యవధిలో ఎక్కువ శ్రద్ధతో కూచిపూడి నృత్యాన్ని నేర్పించారు. నృత్య శాఖ విభాగానికి చెందిన ప్రొఫెసర్ అరుణా భిక్షు, హెచ్ సి యు ద్వారా వర్క్ షాప్ నిర్వహించబడింది. నాట్యాన్ని ప్రాధమికస్థాయిలో నేర్చుకొంటున్నవారు కొత్తగా నాట్యాన్ని అభ్యసించేవారు పదహారుమంది పాల్గొన్నారు. ఈ బృందంలో తెలుగు మాట్లాడే కెనడియన్ పౌరులతో పాటుభిన్నమైన బెంగాలీలు, శ్రీలంక వంటి వరుసగా ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రాథమికంగా వివిధ సాంస్కృతిక మరియు భాషా సమూహాలకు చెందిన కళాకారుణులు తెలుగు నృత్య రూపాన్ని అందించారు.మూడున్నర గంటల సేపు తమ విలువైన ప్రదర్శన ఇచ్చారు.సాంప్రదాయ యుగళగీతంతో సాంప్రదాయ కూచిపూడి సమ్మేళన ప్రదర్శనను 400 మందికి పైగా ప్రేక్షకుల నిలబడి ప్రదర్శనాకారులను అభినందించారు. సాయంత్రం గౌరవ అతిథులు దీపికా డమెర్ల (ఎంపీ ,కెనడా) మరియు దీనబాబు (బోర్డు సభ్యుడు, సిలికాన్ ఆంధ్ర) శ్రీమతి వేమూరి సుధా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని శ్రీ మతి అరుణ భిక్షు తన గురువైన లేట్ ఏలేశ్వరపు సూర్యప్రకాశ శర్మకు అంకితం చేసారు.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!