టెక్సాస్ కు భారీ ఆర్ధిక సాయం ప్రకటించిన ట్రంప్
- September 03, 2017
హార్వే తుఫాన్ సృష్టించిన బీభత్సం టెక్సాస్‌ను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఆ అమెరికా రాష్ట్రానికి దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ నష్టపరిహారాన్ని అందించాలనుకుంటున్నారు. సహాయక చర్యల కోసం మొదటి దఫాగా సుమారు 50 వేల కోట్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే అంత మొత్తం ఆర్థిక సాయం అందించాలంటే ముందుగా కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది. టెక్సాస్, లూసియానా రాష్ట్రాల వరద బాధితులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ అకౌంట్‌ను రిలీజ్ చేసేందుకు కావాల్సిన చర్యలపై ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌తో మాట్లాడినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఒకసారి టెక్సాస్ వెళ్లిన ట్రంప్ మరోసారి ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హరికేన్ హార్వే వల్ల సుమారు 47 మంది చనిపోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







