చిరు ఆఫర్ ను సొంతం చేసుకోనున్న ప్రగ్యా
- September 03, 2017
రీసెంట్గా రిలీజ్ అయిన 'నక్షత్రం', 'జయ జానకి నాయక' సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రగ్యా జైస్వాల్‌కి మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా'లో ఆఫర్ వచ్చిందనేది లేటెస్ట్ న్యూస్. కొణిదెల బ్యానర్ మీద రాంచరణ్ నిర్మిస్తున్న ఈ మూవీలో చిరుకి జోడీగా ఇప్పటికే నయనతారని ఫిక్స్ చేసేశారు. కానీ స్టోరీ ప్రకారం మూవీలో ముగ్గురు హీరోయిన్లు వుంటారనే టాక్ వినిపిస్తోంది.
ఆ ముగ్గురు హీరోయిన్లలో ప్రగ్యాని ఓ హీరోయిన్గా ఫైనల్ చేశారని వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే ప్రగ్యాకి బంపర్ ఆఫర్ తగిలినట్టే! అసలు ప్రగ్యా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిందే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ 'కంచె' మూవీతో. అది కూడా పిరియాడికల్ మూవీ కావడం.. ఆ మూవీలో ప్రగ్యా లుక్స్ బాగుండడంతో.. ఇప్పుడు 'సైరా'లో ఆఫర్ వచ్చిందంటున్నారు. ఐతే..ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







