10న 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

- September 03, 2017 , by Maagulf
10న 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న 'స్పైడర్' చిత్ర విడుదలకు రంగం సిద్ధమౌతోంది. ప్రముఖ దర్శకుడు 'మురుగదాస్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కొద్ది రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం కోసం అభిమానులు తెగ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 'మహేష్' సినిమాలో 'రా' ఏజెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది.
రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం రొమేనియాకు వెళ్లింది. తమిళం..తెలుగు భాషాల్లో ఒకేసారి రూపొందుతోంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. అందులో భాగంగా ఈనెల 10వ తేదీన చైన్నైలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. దాని ద్వారా మహేష్ బాబు కోలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. అదే వేదికపై చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.

దీనికి ముందు హైదరాబాద్‌లో ఈ నెల నాలుగో తేదీన ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com