సంక్రాంతి బరిలో పవన్ సినిమా
- September 03, 2017
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమా కోసం అభిమానులు ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. ఆయన నటించిన 'కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. 'పవన్' సరసన 'కీర్తి సురేష్', 'అను ఇమ్మానుయేల్' హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కథతో రూపొందుతోంది ? పవన్ పాత్ర ఎలా ఉండబోతోంది ? తదితర విషయాలకు బయటకు పొక్కడం లేదు. సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా రావడం లేదు. తాజాగా 'పవన్' బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం ఓ టీజర్ ను విడుదల చేశారు.
ఇక్కడ పూర్తిగా 'పవన్' ను టైటిల్ ను మాత్రం చూపించలేదు. కొద్ది కణాల పాటు 'పవన్' ను నీడలా చూపించారు. సినిమాలోని ఓ పాటను అనిరుధ్ హమ్ చేస్తుండగా పక్కనే దర్శకుడు త్రివిక్రమ్ ఎంజాయ్ చేసున్న దృశ్యాలు ఈ వీడియోలో చూపించారు. 'బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఒ క్లాక్...
'అంటూ ఈ పాట ట్రెండీగా ఉందనిపిస్తుంది. చివరిలో 'పవన్' కుర్చీ తిప్పి.. నిశ్శబ్ధంగా నిల్చొని ఉన్న సన్నివేశాన్ని చూపించారు. ఇక టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు.
జనవరి 10, 2018న సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించింది. మరి టైటిల్ ఏంటో త్వరలోనే తెలియనుంది. 'ఇంజినీర్ బాబు' పేరు ఖరారు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







