డేరా లో ఏం జరుగుతోంది?

- September 04, 2017 , by Maagulf
డేరా లో ఏం జరుగుతోంది?

డేరా బాబా ఆశ్రమంలో చేసిన అరాచకాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. బాబా ఆశ్రమాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు... అక్కడి సీన్‌లు చూసి షాకవుతున్నారు. సిర్సాలోని ఆశ్రమంలో ఇవాళ 33 తుపాకీలను సీజ్‌ చేశారు. వీటిలో పాయింట్ త్రీ వన్‌ ఫైవ్‌ బోర్ రైఫిల్స్‌, పిస్టల్స్, రివాల్వర్స్‌ ఉండడం కలకలం సృష్టిస్తోంది. ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలా ఆయుధాలు భారీగా ఎందుకుంచారన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. డేరా సచ్చా సౌధా పేరుతో 67 ఆయుధాలకు లైసెన్స్ ఇచ్చామంటున్నారు పోలీసులు. ఇంత పెద్ద మొత్తంలో లైసెన్సులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నదానిపై పోలీసులు పెదవి విప్పడం లేదు. మిగిలిన 34 ఆయుధాలను స్వాధీనం చేయమని డేరా నిర్వాహకులకు నోటీసు ఇచ్చామంటూ తప్పించుకుంటున్నారు సిర్సా పోలీసులు. 
డేరా ఆశ్రమంలో ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షకు గురైన రామ్ రహీమ్ సింగ్‌.. తన కోసం ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచ్‌కులలో కోర్టు తీర్పు వెల్లడైన తర్వాత అల్లర్లకు పాల్పడింది వీళ్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com