ఉత్తరకొరియా కు ఎదురు వెళ్లే శక్తి మాకు లేదు - పాకిస్తాన్
- September 05, 2017
ఉత్తరకొరియా దగ్గర ఉన్న అణు సాంకేతికత మాకంటే శక్తిమంతమైనదని పాకిస్థాన్ అణుశాస్త్రవేత్త డా.అబ్దుల్ ఖాదీర్ ఖాన్ తెలిపారు. ఉ.కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షలో ప్యాంగ్యాంగ్‌కు పాక్ ఎటువంటి సాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి పితామహుడిగా ఖాన్‌ను పిలుస్తారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఉ.కొరియా శాస్త్రవేత్తలు అత్యంత సామర్థ్యం కలిగిన వారు, వారిలో ఎక్కువ మంది రష్యాలో విద్యనభ్యసించారు. వారి దగ్గర మాకంటే మెరుగైన సాంకేతికత ఉంది. మా దగ్గర పాత, సంప్రదాయ టెక్నాలజీ ఉంది' అని ఆయన తెలిపారు. ఉత్తరకొరియా అణు ప్రయోగంలో పాకిస్థాన్ పాత్ర ఉందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు.
'హైడ్రోజన్ బాంబులు అణుబాంబుల కంటే మరింత శక్తిమంతమైనవి. ఉదాహరణకి..
అణుబాంబు రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న పరిసరాలను మాత్రమే నాశనం చేస్తుంది. కానీ హైడ్రోజన్ బాంబుకు నగరం మొత్తాన్ని నాశనం చేసే శక్తి ఉంది' అని ఆయన పేర్కొన్నారు. ఉ.కొరియా ఆదివారం అణుపరీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో పాకిస్థాన్ హస్తం కూడా ఉందని ప్రపంచదేశాలు ఆరోపించాయి. ఉ.కొరియా చర్యలను ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







