కాళోజి పురస్కారం అందుకోనున్న వందేమాతరం శ్రీనివాస్
- September 05, 2017
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా, ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు కాళోజి పురస్కారం ఇవ్వనున్నట్లు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షులు డి .సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా డి .సురేష్ కుమార్ మాట్లాడుతూ - "గత 5 ఏళ్లుగా ప్రజా కవి కాళోజి నారాయణ రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరుమీద 'కాళోజి' పురస్కారం తెలుగు సినిమా పరిశ్రమ లోని ప్రముఖ రచయితలకు ఇస్తూవచ్చాము. ఈ ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయినా వందేమాతరం శ్రీనివాస్ కు ఈ అవార్డు ఇవ్వడానికి సంతోషంగా తెలియచేస్తున్నాను. 2016 లో రచయిత చంద్ర బోస్ కి కాళోజి అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. వారం లో జరగబోయే ఈ ప్రదానోత్సవంలో ఒకే వేదిక పై చంద్ర బోస్, వందేమాతరం శ్రీనివాస్ లను సన్మానించడం జరుగుతుంది." తెలంగాణ టివి డెవలప్ మెంట్ ఫోరమ్, భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టివి రచయితల సంఘం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







