షార్జా లో శ్రీలంక కుటుంబం ఆత్మహత్య - ముగ్గురు మృతి

- September 06, 2017 , by Maagulf
షార్జా లో  శ్రీలంక కుటుంబం ఆత్మహత్య - ముగ్గురు మృతి

షార్జా: ఆగస్టు 29 వ తేదీన షార్జాలోని ఒక హోటల్ అపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా చనిపోయిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు షార్జా పోలీసులు  ధృవీకరించారు. ఈ సంఘటన గూర్చి పోలీసులు  మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నంలో ఒక పురుషుడు, అతని భార్య , వారి కుమారుడు చనిపోగా,    మృతుని  సోదరి మరియు మేనకోడలు ప్రాణాలతో బయటపడ్డారు వీరంతా శ్రీలంక దేశానికి చెందినవారు.  జె .కె అని పిలవబడే 55 ఏళ్ల వ్యక్తి , బి .ఎస్. గా పిలవబడే అతని 54 ఏళ్ల  భార్య  మరియు వారి 19 ఏళ్ల కుమారుడు జె. ఎన్. మృతదేహాలను ఆల్ కువైట్ ఆసుపత్రికి తరలించబడ్డాయి. ఆ తరువాత ఫోరెన్సిక్ ప్రయోగశాలలో శవపరీక్షలు నిర్వహించారు. ఆత్మహత్య యత్నంలో బతికిబయటపడిన ఇద్దరు యువతులు  డివి, 17, మరియు పి.ఎల్   27, అల్ కువైట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది మరియు మానసిక అంచనా కోసం రాస్ అల్ ఖైమాలో ఉన్న ఉబైదుల్లాహ్  హాస్పిటల్ కు బదిలీ చేయబడ్డారు.ఈ సంఘటన ఆగష్టు 29 న తెల్లవారుజామున  2.30 సమయంలో భవనం యొక్క 7 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొనేసమయంలో పొరుగు భవనంలో సాక్షి వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించాడు వెనువెంటనే  పోలీసులు మరియు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చారు. చనిపోయిన వ్యక్తిని గుర్తించి తనిఖీ చేసిన తరువాత, మిగిలినవారు ఆ  భవనంలోనే ఉన్నారని పోలీసులు కనుగొన్నారు. పోలీసులు  అపార్ట్మెంట్ ఏడవ అంతస్తులో ఉన్న మిగిలినవారి కోసం వెళ్లారు. వారు గది లోపల తాళం వేసుకొని ఉన్నారు. పోలీసులు తలుపు విరగగొట్టి ఆ గది లోపలకు  ప్రవేశించారు. లోపల, ఒక చిన్న పిల్లవాడి శరీరం తెల్లటి దుప్పటి కప్పి నేలపై పది ఉంది. నేలమీద ఒక వృద్ధురాలు ,ఇద్దరు యువతులు చేతిమణికట్టుకోయబడి ఒక రక్తం మడుగులో పడివున్నారు. ఆ గదిలో కప్పులలో ఎరుపు ద్రవం  మరియు చిన్న తెల్లని బంతులను కలిగిన వివిధ రకాలైన ఔషధాలను పోలీసులు కనుగొన్నారు.మొదటిగా ఎదవా అంతస్థు నుంచి కిందకు దూకిన వ్యక్తి, బాలుడు చనిపోగా ఆ తర్వాత ఆ  ముగ్గురు మహిళలు  ఆత్మహత్య ప్రయత్నాలలో ఒకరు మరణించారు, గత ఏడాది కాలంగా తమ భవనంలోనే నివసిస్తూ, నెలకు  6 ,250  ధిర్హాంలను అద్దెగా వారు చెల్లిస్తున్నట్లు  అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధి ఒకరు " మా గల్ఫ్ డాట్ కామ్ "  కు  తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com