వేసవి లో కార్మికులకు పని నిషేధం ఓ భారీ విజయం: మంత్రి
- September 06, 2017
మనామ : బహిరంగ పని నిషేధంను పలు కంపెనీలు మరియు సంస్థల తొంభై ఎనిమిది శాతం అమలుచేశాయి. మిట్ట మధ్యాహ్నం నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రామికులను తీవ్ర వేసవి వేడిమి సమయంలో పనిని చేయకుండా నిలువరించినట్లు కార్మిక మంత్రి జమీల్ బిన్ మహ్మద్ ఆలీ హుమాదాన్ బుధవారం చెప్పారు. ఈ వేసవిలో బహిరంగ పని నిషేధం ముగింపు గురించి వ్యాఖ్యానిస్తూ, 150,000 కన్నా ఎక్కువ మంది కార్మికులను కాపాడటం మరియు మానవ హక్కులను కాపాడుకోవాలనే ఆసక్తితో వివిధ పని ప్రదేశాలలో భద్రత కల్పించే లక్ష్యాలను సాధించినట్లు ఆయన తెలిపారు. బహిరంగ మధ్యాహ్నం పని నిషేధం 2013 యొక్క 3 వ ఎడిషన్ ప్రకారం యజమానులకు దీని గూర్చి అధిక అవగాహన ప్రతిబింబిస్తుంది, కంపెనీల పూర్తి సహకారం, మానవ జీవితం యొక్క గొప్ప విలువలకై వారు చూపిన సానుకూల స్పందన మరియు అవగాహన అభినందిస్తున్నాము. 98 శాతం సమ్మతి రేటు కార్మికులు రక్షించడానికి మరియు వారి భద్రత నిర్ధారించడానికి వారి మానవతను సూచిస్తుంది మానవ హక్కుల పట్ల గౌరవంగా ప్రతిబింబిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో బహ్రెయిన్ అధునాతన పురోగతులు స్వాగతం పలుకుతున్నాయని, అంతర్జాతీయ సంస్థల చేత కీర్తించబడుతున్నట్లు ఆయన అన్నారు. కార్మిక మంత్రిత్వశాఖ కార్మికులు పని చేసే ప్రాంతాలలో పర్యావరణం అభివృద్ధి, ప్రైవేటు రంగాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం, సాధ్యమైనంత వృత్తిపరమైన ప్రమాదాలు జరగకుండా నివారించడం, ఉత్పాదకత మరియు సంస్థల లాభాలను పెంపొందించడం వంటి అంశాలని ఆయన ప్రముఖంగా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







