అమరావతి లో అమెరికన్ ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన
- September 07, 2017
మరో ప్రతిష్టాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఏర్పాటుకు అమరావతి వేదికగా నిలిచింది. అమరావతి అమెరికన్ ఆస్పత్రి నిర్మాణానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో 20 ఎకరాల స్థలంలో ఈ ఆస్పత్రి నిర్మాణానికి ప్రవాసాంధ్రులు ముందుకువచ్చారు. మొత్తం మూడు దశల్లో రూ.600 కోట్ల పెట్టుబడితో 700 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా దీన్ని నిర్మించనున్నారు. 2019 మార్చి నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తికానుంది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హేతుబద్ధతలేని రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని, ఆ సమయంలో అంతా బాధపడ్డామన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచంలోనే ఆధునిక రాజధాని నిర్మించాలని తాము సంకల్పించామన్నారు. అమరావతికి 13 వైద్య కళాశాలలు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







