మణిరత్నం దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య రాజేశ్
- September 08, 2017
ఎస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ ఐశ్వర్యరాజేశ్‌ను వరించింది. హీరోయిన్ పాత్రే కావాలంటూ అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన పాత్రల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న నటి ఐశ్వర్యరాజేశ్. కాకాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా అద్భుతంగా నటించి ప్రశంసలు పొందిన ఈ సహజ నటికి ఆ తరువాత స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు తలుపుతడుతున్నాయి.
ప్రస్తుతం విక్రమ్ సరసన ధ్రువనక్షత్రం, ధనుష్‌తో వడచెన్నై చిత్రాల్లో నటిస్తున్న ఐశ్వర్యరాజేశ్ బాలీవుడ్లో నటించిన డాడీ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. వీటితో పాటు మలయాళంలోనూ అడుగుపెట్టిన ఐశ్వర్యరాజేశ్‌కు తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. కాట్రువెలియిడై చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా దర్శకుడు మణిరత్నం తాజా చిత్రానికి రెడీ అయ్యారు.
ఇందులో నటించే నటీనటుల గురించి ఇంతకు ముందు రకరకాల ప్రచారం జరిగినా తాజాగా నటి ఐశ్వర్యరాజేశ్ నటించే విషయం పక్కాగా ఓకే అయ్యిందని ఆమె స్పష్టం చేశారు. అంతే కాదు ఇందులో నటి జ్యోతిక కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా నటుడు విజయ్‌సేతుపతి, టాలీవుడ్ హీరో నాని ఈ క్రేజీ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









